News January 18, 2025
KMR: ఈ నెల 21 నుంచి ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు

కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు KMR జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల శనివారం తెలిపారు. ఈ నెల 21న కామారెడ్డి, 22న ఎల్లారెడ్డి, 23న జుక్కల్, 24న బాన్సువాడ నియోజకవర్గాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్యాంప్‌కు హాజరయ్యే వారు సంబంధిత పత్రాలతో ఉదయం 9:30 గం.లకు హాజరు కావాలని సూచించారు.
Similar News
News November 6, 2025
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.
News November 6, 2025
GNT: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన ఎల్ఎల్‌బి రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. ఎల్ఎల్‌బి మూడో సంవత్సరం మూడో సెమిస్టర్, ఐదవ సంవత్సరం ఏడో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 6, 2025
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

తెనాలి 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాజర్‌పేటలో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ నేతృత్వంలో వెళ్లిన టాస్క్‌ఫోర్స్ బృందం వారి నుంచి రూ.500 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అసాంఘిక కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.


