News January 2, 2026

KMR: ఈ నెల 3న జాబ్ మేళా

image

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News January 2, 2026

సిద్ధమవుతున్న బరులు.. సన్నద్ధమవుతున్న పుంజులు

image

సంక్రాంతికి కోడి పందేల కోసం గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల పొలాలను చదును చేసి బరులుగా మారుస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే బరుల వద్దే సోఫా సీటింగ్, ACలు, లైవ్ స్క్రీన్స్ కోసం ఆర్డర్స్ వచ్చినట్లు షామియానాల నిర్వాహకులు తెలిపారు. అటు కోడిపుంజులనూ పందెంరాయుళ్లు సన్నద్ధం చేస్తున్నారు. రెగ్యులర్‌గా జీడిపప్పు, బాదం తదితర డైట్ ఫుడ్‌కు తోడు ఎక్కువ ఎక్సర్‌సైజులు చేయిస్తున్నారు.

News January 2, 2026

నేషనల్ హైవేలపై నేడు మచిలీపట్నంలో కీలక సమీక్ష

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిథిలో నేషనల్ హైవేల అభివృద్ధిపై మచిలీపట్నం, విజయవాడ ఎంపీలు శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. మచిలీపట్నంలోని ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్ నుంచి నేషనల్ హైవే ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

News January 2, 2026

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.