News March 22, 2025
KMR: ఈ నెల 31 వరకు దరఖాస్తులక అవకాశం

ప్రధాని మంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దేశంలోని 500 పైచిలుకు కంపెనీల్లో ఇంటర్న్‌లుగా చేరి పని అనుభవాన్ని గడిచే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 23, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.06 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.28 గంటలకు
ఇష: రాత్రి 7.40 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 23, 2025
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం: మంత్రి

నేటికి పిల్లలు నేల మీద కూర్చుని చదవటం బాధాకరమని మంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అన్ని పాఠశాలలో బల్లలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. వైకుంఠపురంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
News March 23, 2025
యువత బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: సీఐ వాసంతి

యువకులు బెట్టింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు సీఐ శ్రీనివాసంతి శనివారం తెలిపారు. ఐపీఎల్ మోజులో పడి యువకులు బానిసలు కాకూడదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బెట్టింగ్ గురించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని ఆమె కోరారు.