News September 7, 2025

KMR: ఉత్తమ ఉపాధ్యాయులకు 8న అవార్డులు ప్రదానం

image

కామారెడ్డి జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలందిస్తున్న 41 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ఈనెల 8న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా అవార్డులను ప్రధానం చేసి, శాలువాలతో సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.GHM,LFLHM, SA, SGT, PD, SO, CRT తదితర హోదాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

Similar News

News September 8, 2025

సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?

image

కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. జనవరి 13వ తేదీని మూవీ టీమ్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీకి ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలాఖరులోగా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్/ నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

News September 8, 2025

‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం: TS UTF

image

TG: ప్రభుత్వ టీచర్లకు TET తప్పనిసరి అని ఇచ్చిన <<17587484>>తీర్పును<<>> సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కోరింది. ’20-25 ఏళ్లుగా విధుల్లో ఉన్న సీనియర్లను TET రాయమనడం అన్యాయం. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన వారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలి. 2010 NCTE నోటిఫికేషన్ ప్రకారం TET పాస్ అనేది నియామకాలకు తప్పనిసరి అయింది’ అని గుర్తుచేసింది.

News September 8, 2025

సంగారెడ్డి: ఉద్యోగాల భర్తీకి రేపే చివరి తేదీ

image

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన 59 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఒప్పంద పద్ధతిపై ఇన్స్‌ట్రక్టర్, ఆయాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్నదని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.