News January 27, 2025
KMR: ఉత్తమ సేవలకు ప్రశంసా పతకాలు

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 43 మందికి ప్రశంసా పత్రాలు, 10 మందికి అతి ఉత్కృష్ట సేవా పతకాలు, మరో ఉత్కృష్ట సేవా, పోలీసు పతకాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధూ శర్మ, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి అందజేశారు.
Similar News
News September 19, 2025
నల్గొండ: జిల్లాలో తగ్గిన వాహన రిజిస్ట్రేషన్లు

జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. జులై, ఆగస్టు నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య వెయ్యికి పైగా చేరాయి. కానీ సెప్టెంబర్‌లో మాత్రం వందల సంఖ్యలో మాత్రమే వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కార్లు, బైక్‌లపై కేంద్రం విధించే జీఎస్టీని తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందని ఆగస్టు నెలాఖరులో కేంద్రం ప్రకటించింది. దీంతో వాహనప్రియులు తమ వాహనాల బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు.
News September 19, 2025
SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 19, 2025
29 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలపై మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 20 మంది వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు, 9 మందికి మెమోలు జారీ చేసినట్లు వివరించారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.