News December 30, 2025
KMR: ‘ఎగిరే గాలిపటం.. తీయొద్దు ప్రాణం’

సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహం ఇతరుల ప్రాణాల మీదకు రాకూడదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర ప్రజలను కోరారు. గత సంక్రాంతి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో 65 బెండల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Similar News
News January 1, 2026
‘రాష్ట్రంలోనే జగిత్యాలను ప్రథమ స్థానంలో నిలుపుదాం’

విద్యా రంగంలో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదామని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ JGTL జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సం.డైరీ, క్యాలెండర్‌ను గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, DEO రాములు ఆవిష్కరించారు. ఇందులో TRS రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
News January 1, 2026
వరంగల్: న్యూ ఇయర్ వేళ ప్రభుత్వ ఆసుపత్రిలో కవలల జననం!

న్యూ ఇయర్ వేళ జన్మించిన కవలలు ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. 2026 నూతన సంవత్సరం వేళ వరంగల్ CKM ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో గురువారం ఉదయం వరంగల్ గిర్మాజిపేటకు చెందిన ఓ మహిళ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. వీరితో పాటు ఆసుపత్రిలో మరో 10 మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు జన్మించారు. జీవిత కాలం గుర్తుండేలా నూతన సంవత్సరంలో పుట్టిన పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
News January 1, 2026
సంగారెడ్డి: ‘ఇంటర్ పరీక్షలకు సిద్ధం చేయాలి’

జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఇంటర్ పరీక్షలకు ఇప్పటి నుంచి సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందరామ్ గురువారం తెలిపారు. సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని చెప్పారు. మంచి ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.


