News January 31, 2025
KMR: ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం బాదల్ గావ్ శివారులో ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మత్లి తండాకు చెందిన చౌహాన్(40) కుటుంబంతో కలిసి చెరకు నరికే పనులకు వెళ్లాడు. చెరకు తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఎడ్ల బండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
ట్యాంక్‌బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.
News November 9, 2025
వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు: అదనపు కలెక్టర్

హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాలో 24 కంపెనీలు పాల్గొనగా 682 మంది యువతీ యువకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 214 మందికి ఉద్యోగాలు దక్కాయి. వృత్తి విద్యతో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి సూచించారు.
News November 9, 2025
ఇతిహాసాలు – 61 సమాధానం

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>


