News January 28, 2025
KMR: ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉంచాలి: కలెక్టర్

రానున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గౌడౌన్‌లో పంచాయితీ ఎన్నికల సామాగ్రిని ఆయన సోమవారం పరిశీలించారు. ఎన్నికలకు ఉపయోగించే సామగ్రి భద్రంగా ఉంచాలని, మండలాల వారీగా సరఫరా చేయడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. వెంట జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, తదితరులు ఉన్నారు.
Similar News
News November 5, 2025
ఏలూరు కలెక్టర్‌తో బేటి అయిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ కలెక్టర్ ప్రజలకు మంచి సేవలను అందించారని కొనియాడారు. ఈ సందర్భంగానే కలెక్టర్‌ను సత్కరించి సంస్థ తరఫున జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షుడు జబీర్ తో హరీష్, మిల్టన్, దరిశి నారాయణ, తదితరులు ఉన్నారు.
News November 5, 2025
SRPT: కారు బోల్తా.. మహిళ మృతి, ఇద్దరికి గాయాలు

కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైన ఘటన మోతె మండలం మామిళ్లగూడెం దగ్గర జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు పల్టీ కొట్టి పక్కకు పడిపోయింది. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 5, 2025
ప్రగతినగర్: చెరువా.. కాలుష్య కర్మాగారమా?

స్థానిక అంబిర్ చెరువు కాలుష్య కర్మాగారంగా దర్శనమిస్తోంది. ఎంతో పురాతనమైన ఈ చెరువు కబ్జాలకు అడ్డాగా మారింది. చెరువు చుట్టూ చెత్తాచెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోని నీరు కూడా అంతే. ఒక వైపు ఉన్న మాంసం అంగళ్ల నిర్వాహకులు వ్యర్థ పదార్థాలను చెరువులో పడేస్తున్నారు. చెరువు పక్కగుండా వెళ్లాలంటే ముక్కలు మూసుకోవాల్సిందే. అధికారులు స్పందించి చెరువును రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


