News April 2, 2025
KMR: ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు: డీఈఓ రాజు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 9 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించినట్టు జిల్లా డీఈఓ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. (సమ్మేటివ్ -2) వార్షిక పరీక్షలు నిర్వహిస్తారని తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులకు పరీక్షలకు సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. అనంతరం 12:30కి మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంటుందని తెలిపారు.
Similar News
News July 9, 2025
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మహర్దశ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్‌పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.
News July 9, 2025
ASF: ఉప్పొంగిన ప్రాణహిత

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలతో పెన్‌గంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఒక్కచోట చేరి తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకాయి. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందువల్ల సమీప గ్రామ ప్రజలు నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
News July 9, 2025
HYD: కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం: మంత్రి

HYDలో కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు Xలో ట్వీట్ చేశారు. ‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా వదలం. కల్లు శాంపిల్ టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ పంపాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు, కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని రాసుకొచ్చారు.