News November 10, 2025
KMR: కలెక్టరేట్‌లో ప్రజావాణికి 80 అర్జీలు

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 80 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం ఆయన సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరిధిలో పరిష్కరించలేని సమస్యలపై దరఖాస్తుదారులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.
Similar News
News November 10, 2025
ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.
News November 10, 2025
విశాఖ: బ్లాక్ లిస్టులోకి ‘చెత్త’ కన్సల్టెన్సీ

క్లాప్ వాహనాల నిర్వహణకు కార్మికులను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్, కన్సల్టెంట్ ఒప్పందాన్ని GVMC రద్దు చేసింది. శ్రీదుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికులను సమయానికి పంపకపోవడం, పనితీరులో లోపాలు, నిధులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పలువురి కార్మికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్టు GVMC వర్గాలు తెలిపాయి.
News November 10, 2025
సమస్యలు వాట్సప్ చేయండి.. పార్లమెంట్‌లో ప్రశ్నిస్తా: MP

ఏలూరు జిల్లాలో సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమస్యలను 9618194377, 9885519299 ఈ నెంబర్లకు వాట్సాప్ చేయాలంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యలను పరిశీలించి పార్లమెంటులో ప్రశ్నిస్తానని చెప్పారు. ప్రశ్నలు పంపిన వారిని పార్లమెంట్‌కు ఆహ్వానించి ఒకరోజు విజిటర్స్ గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తానని చెప్పారు.


