News October 8, 2025
KMR: కలెక్టర్ చొరవ.. బాలికలకు ISRO టూర్

కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో 10వ తరగతి చదువుతున్న 30 మంది బాలికలను ప్రభుత్వ ఖర్చుతో ISRO టూర్‌కు తీసుకెళ్లనున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. ఈ పర్యటన కోసం బుధవారం స్పేస్ సైన్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్‌కు జిల్లా విద్యార్థులు, విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News October 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
✓ లింక్ క్లిక్ చేసి రూ.1.25 లక్షలు పోగొట్టుకున్న పాల్వంచ యువకుడు
✓ భద్రాచలంలో రూ.10 లక్షల బాణసంచా సీజ్
✓ భద్రాద్రి: మండలాలకు చేరిన బ్యాలెట్ బాక్సులు
✓ నోటికాడి కూడు లాక్కోవద్దని పినపాక పోడు రైతుల ఆవేదన
✓ కొత్తగూడెం: CJIపై దాడి చేసిన వారిని శిక్షించాలి: యూత్ కాంగ్రెస్
✓ములకలపల్లి: పిడుగుపాటుకు ఇల్లు దగ్ధం
News October 9, 2025
భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన భూగర్భ జల అంచనా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ వంటి చర్యల ద్వారా నీటిమట్టం మెరుగుపడిందన్నారు. భూగర్భ జల ఉపసంహరణ నిబంధనలు–2023ను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News October 9, 2025
కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CBN

AP: కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై YCP రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.