News August 18, 2025

KMR: కళకళలాడుతున్న ప్రాజెక్టులు

image

కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నిండుగా ఉంది. కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్ నాలా, సింగీతం రిజర్వాయర్‌లలోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నాయి.

Similar News

News August 18, 2025

నిజాంపట్నం పోర్టుకు 3వ ప్రమాద హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం పోర్టుకు సోమవారం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 18, 2025

సాలూరు: తల్లి మరణం తట్టుకోలేక తనయుడి సూసైడ్

image

తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాలూరుకు చెందిన తట్టికోట సరస్వతి(80) ఈనెల 8న మరణించారు. ఆమె లేదని మనస్తాపం చెందిన కుమారుడు రామక్రిష్ణ (50) సోమవారం నుంచి కనిపించకపోగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరఘట్టం వద్ద నాగావళి నదిలో శవమై కనిపించాడు. తనకు అండగా ఉండే అమ్మ చనిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

News August 18, 2025

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.