News March 25, 2025
KMR: కాంగ్రెస్‌లో వర్గపోరుపై అధిష్టానం నజర్

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల వర్గపోరుపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ ప్రతినిధికి, ఇటీవల పార్టీలో చేరిన ప్రతినిధికి మధ్య జరుగుతున్న వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో పలువురు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. BRS హయాంలో కష్ట కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని వాపోతున్నారు.
Similar News
News September 16, 2025
గన్నవరం ఎయిర్ పోర్టులో రేపు ప్రయాణికులకు గ్రాండ్ వెల్కం

గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా యాత్రిసేవా దివస్‌ను బుధవారం నిర్వహించబోతున్నారు. ప్రయాణికులకు క్వాలిటీ సర్వీసెస్ అందించడంలో భాగంగా వారికి గ్రాండ్‌గా వెల్కం చేయడం, వైద్య పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు ఎయిర్‌పోర్టు చూపించడం, ఏవియేషన్ రంగంలో ఉద్యోగావకాశాల కల్పనపై తరగతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని చర్యలు తీసుకోనున్నారు.
News September 16, 2025
భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త

AP: తనను ఉపాధ్యాయుడిగా చూడాలన్న భార్య చివరి కోరికను తీర్చాడు భర్త. ఎన్టీఆర్(D) రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ భార్య ఏడాది క్రితం డెంగీతో మరణించారు. ఇటీవల ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)గా DSCలో ఎంపికయ్యారు. ఆమె చివరి కోరికను తీర్చడానికి రోజుకు 10 గంటలకు పైగా చదివినట్లు రామకృష్ణ తెలిపారు. తన భార్య బతికి ఉంటే సంతోషించేదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
News September 16, 2025
ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి, ప్రజా పాలన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.