News April 2, 2025

KMR: కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం

image

కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షుల సమావేశం మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ న్యాయ యోధ మెంబర్షిప్‌ లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన జాతీయ నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ నీలం రమేశ్ ఉన్నారు.

Similar News

News October 30, 2025

సిద్దిపేట: కలెక్టర్‌లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

image

సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మొంథా తుపాను ప్రభావం సహాయక చర్యలు, తదితర పై అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలో 40 సెంటీమీటర్లకు పైగా వర్షలు పడ్డాయని, అపార పంట నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారు.

News October 30, 2025

కాలుష్యం కాటుతో ఇండియాలో 17 లక్షల మంది మృతి

image

పెట్రోల్, డీజిల్ వంటి వినియోగంతో వెలువడుతున్న కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 2022లో 25 లక్షల మంది బలైనట్లు ‘ది లాన్సెట్’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఒక్క ఇండియాలోనే 17 లక్షల మంది మరణించినట్లు వివరించింది. 2010తో పోలిస్తే మరణాలు 38% పెరిగినట్లు పేర్కొంది. ఈ ఇంధన వాడకం 2016 కన్నా 21% పెరిగిందని తేల్చింది. ఢిల్లీ వంటి చోట్ల కాలుష్యం స్థాయులు పెరుగుతుండడంతో ఈ రిపోర్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News October 30, 2025

KNR: రూ.30 కోట్లు మంజూరు చేసిన TTD

image

KNRలోని పద్మానగర్‌లో నిర్మించనున్న వెంకటేశ్వరస్వామి దేవాలయ నిర్మాణానికి TTD ₹30 కోట్లు మంజూరు చేసింది. ఆలయ పరిసరాల్లో ₹3 కోట్లతో ఆధ్యాత్మిక ఉద్యానవనాన్ని కూడా నిర్మించనుంది. 4 ఏళ్ల క్రితం మాజీమంత్రి గంగుల కమలాకర్ ఆలయ నిర్మాణం కోసం అప్పటి TTD చైర్మన్‌కు ప్రతిపాదనలు పంపారు. దీనిని TTD ఆమోదించడంతో ఆలయానికి 10 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2023 మే నెలలో దేవాలయానికి అంకురార్పణ చేశారు.