News December 7, 2025
KMR: కేంద్ర మంత్రిని కలిసిన పైడి ఎల్లారెడ్డి

హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు డా.పైడి ఎల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో జరుగుతున్న సర్పంచి ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇరువురు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలను ప్రజలకు చేరువ చేసి, పార్టీ పటిష్టత పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.
Similar News
News December 8, 2025
కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.
News December 8, 2025
విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారా?

శ్రీవారితో పాటు ఆలయ గోపురంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడికీ అంతే ప్రత్యేకత ఉంటుందని చాలామంది భక్తులకు తెలిసుండదు. తిరుమలకు వెళ్లినవారు ఇరువురినీ తప్పక దర్శించుకోవాలని <<18475056>>పురోహితులు<<>> సూచిస్తున్నారు. ఆనంద నిలయంపై వాయవ్య మూలన వెండి మకర తోరణంతో ఉన్న మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ విగ్రహం వద్ద ధ్యానం చేసి మోక్షం పొందారని ప్రతీతి.
News December 8, 2025
జగిత్యాల: మూడో విడత.. రేపే అభ్యర్థులకు గుర్తులు

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు రేపు గుర్తులు కేటాయించనున్నారు. దీంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు మొదలైంది. ఎన్నికల అధికారులు పేర్ల ఆధారంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు అలాట్ చేయనున్నారు. ఓటర్లు సులువుగా గుర్తుపట్టే గుర్తు వస్తే బాగుండునని, ఎక్కువ వాడని వస్తువుల గుర్తులువస్తే ఇబ్బందని ముచ్చటించుకుంటున్నారు.


