News February 23, 2026

KMR: కేవీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు: ఎంపీ డీకే అరుణ

image

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి రమణారెడ్డిపై కక్ష గట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేను రానివ్వకుండా చేస్తూ అవమాన పరుస్తున్నారని మండి పడ్డారు. వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అనవసర రాద్ధాంతాలకు తెరలేపిందని కాంగ్రెస్‌ అని అన్నారు.

Similar News

News February 24, 2026

‘ఓం శాంతి శాంతి శాంతిః’ OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

image

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ మూవీ మార్చి 4 నుంచి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ ఒకరోజు ముందే అంటే మార్చి 3 నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు. భర్త పెట్టే హింసను భరిస్తూ చివరకు అతడికి తగిన గుణపాఠం చెప్పే భార్య కథే ఈ సినిమా స్టోరీ.

News February 24, 2026

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు దుర్మరణం!

image

జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సిమ్రియా సమీపంలో సోమవారం సాయంత్రం కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ ప్రాణాలు కోల్పోయారు. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం రాంచీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగిందని చత్రా జిల్లా కలెక్టర్ కీర్తిశ్రీ ధ్రువీకరించారు.

News February 24, 2026

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై కేసు

image

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై సోమవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను MLA నెట్టేశారణే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.