News January 23, 2025
KMR: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు టీజీ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ జిల్లా నోడల్ అధికారి జీ. నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ నెల 7 నుంచి ఫిబ్రవరి 1 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News February 27, 2026
HYD: ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ.10ల కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటకు పొక్కింది. కాగా ప్రభుత్వం దోమల నివారణకు ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది.
News February 27, 2026
అతిథులకు నిలయం అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్!

వరంగల్ నిట్ ప్రాంగణంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్ అతిథులకు నిలయం. ప్రతిష్ఠాత్మకంగా జరిగే స్ప్రింగ్ స్ప్రీ, టెక్నోజియాన్, కాన్వకేషన్ లాంటి వేడుకలకు వచ్చే ముఖ్య అతిథులతో పాటు కేంద్ర మంత్రులు, సినీ నటులకు విడిది కల్పిస్తుంది. 2008 ఆగస్ట్ 18న అబ్దుల్ కలాం స్వయంగా ఈ అతిథి గృహాన్ని సందర్శించారు. ఆ రోజున ఆల్ట్రా మెగా హాస్టల్ భవనానికి పునాది వేసి, కంప్యూటర్ సెంటర్ ప్రారంభించారు.