News May 26, 2024
KMR: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కామారెడ్డి పరిధిలోని మనోహరాబాద్ – గజ్వేల్ రైల్వే స్టేషన్ల మధ్యలో రామాయపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే SI తావునాయక్ తెలిపారు. మృతుడు 55 – 60 సం.ల మధ్య వయస్సు కలిగి, తెల్ల చొక్కా నల్ల ప్యాంటు ధరించాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తమని సంప్రదించాలని SI తెలిపారు.
Similar News
News February 24, 2026
NZB: గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను చూడాలన్నారు.
News February 24, 2026
NZB: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: CP

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని CP సాయి చైతన్య హెచ్చరించారు. సోమవారం ఆయన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో పర్యటించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే అల్లర్లు జరిగితే ఎవరిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.