News January 20, 2025

KMR: గ్రామ సభల్లో వైద్య సిబ్బంది పాల్గొనాలి: జిల్లా వైద్యాధికారి

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో సంబంధిత గ్రామ, మండల ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొనాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ ఆదేశించారు. ఆశా, ANM, సూపర్వైజరీ, MLHP ప్రతి గ్రామ సభల్లో తప్పకుండా ఉండాలన్నారు. గ్రామ సభల్లో సంబంధిత రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News February 25, 2026

కామారెడ్డి: ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు సూచనలకు 9866143782, 9948164514 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.

News February 25, 2026

NIMSలో CMRF ద్వారా రూ.521 కోట్ల విలువచేసే వైద్యం

image

పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో సీఎంఆర్ ఫండ్ ద్వారా అనేకమందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు. 2 సంవత్సరాల్లో ఎల్‌ఓసీల ద్వారా రూ.521 కోట్లకు పైగా విలువైన చికిత్సలు అందించినట్లు వెల్లడించారు. వెన్నెముక శస్త్రచికిత్సలు సైతం నిర్వహించామని, ముఖ్యంగా న్యూరో సర్జరీ కేసులు 2,221 నమోదైనట్లు పేర్కొన్నారు. పేద రోగులకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తున్నట్లు వివరించారు.

News February 25, 2026

సంగారెడ్డి: ‘TG-iPASS ద్వారా వేగంగా అనుమతులు’

image

పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా TG-iPASS విధానం ద్వారా పారదర్శకంగా, వేగంగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల విషయంలో అధికారులు ఖచ్చితత్వంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను తనిఖీ చేసి త్వరగా పరిష్కరించాలని సూచించారు.