News April 11, 2025
KMR: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి కిడ్నాపైన బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీర్జాపూర్కి చెందిన గైక్వాడ్ బాలాజీ.. బాలిక రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ఏసీపీ వివరించారు. సమావేశంలో SHO రఘుపతి పాల్గొన్నారు.
Similar News
News January 10, 2026
‘రాజాసాబ్’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని ‘sacnilk’ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు పేర్కొంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపు కొనసాగుతుండగా తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది.
News January 10, 2026
శ్రీకాకుళం: ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మహేశ్ (27) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. ఏడాది క్రితం పలాస మండలానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతరం కాశీబుగ్గలో నివాసం ఉంటున్నారు. ఇరువురు మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News January 10, 2026
NTR: ఆధ్యాత్మిక శోభ.. ఆకాశమంత హనుమ!

NTR (D) పరిటాలలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆధ్యాత్మికతకు, అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తోంది. 135 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ భారీ విగ్రహం ప్రపంచంలోని ఎత్తైన హనుమాన్ విగ్రహాల్లో ఒకటిగా ఖ్యాతి గడించింది. VJA-HYD రహదారిపై వెళ్లే ప్రయాణికులకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకప్పుడు దేశంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం, ప్రస్తుతం ఏపీలో ఎత్తైన విగ్రహాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది.


