News March 28, 2025

KMR: చెట్టుకు కట్టేసి కొట్టారు (UPDATE)

image

దోమకొండ మండలం చింతామణి పల్లి గ్రామంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. రమేశ్ అనే వ్యక్తిని పలువురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన రమేశ్‌ను కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఓ కారు అమ్మకం విషయంలో గొడవ జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Similar News

News November 6, 2025

‘గూగుల్ సెంటర్‌తో వందల సంఖ్యలోనే ఉద్యోగాలొస్తాయి’

image

విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావని, వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ అన్నారు. సుందర్ పిచాయ్ పేదవాడు కాదని అపర కోటీశ్వరుడన్నారు. 500 ఎకరాలు ఇచ్చి భూములతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు పిచాయ్‌కి మధ్య ఉన్న బంధం ఏంటో వెల్లడించాలన్నారు. ఈనెల 31లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదని కేంద్రం ప్రకటన చేయలన్నారు.

News November 6, 2025

ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కు ఎంపిక చేసిన టీచర్లు చిత్తశుద్ధితో పని చేయాలని అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్ లో ప్రీ ప్రైమరి టీచర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 41 ప్రీ ప్రైమరి పాఠశాలలు ఉన్నాయని, వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులో మెరిట్ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

News November 6, 2025

BECILలో ఉద్యోగాలు

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా(BECIL)9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.295, SC, ST, PWBDలకు ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:
www.becil.com/Vacancies