News March 20, 2025
KMR: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మరణించిన ఘటన కామారెడ్డి జిల్లా సుల్తాన్ పేట్ గ్రామంలో చోటు చేసుకుంది. సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన అమృత్వార్ రాంబోయ్(47) అనే వ్యక్తి లక్ష్మాపూర్ చెరువులో బుధవారం చేపల వేటకు వెళ్లారు. చెరువు లోతు ఎక్కువ ఉండడంతో ప్రమాదవశాత్తు కాలు వలలో చిక్కుకొని మరణించాడని జాలర్లు పోలీసులకు తెలిపారు.
Similar News
News September 13, 2025
పటాన్‌చెరు: దేవుడు స్థలాన్ని చూపించాడని మిస్సింగ్

యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరులో చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నాను’ అని అన్నకు మెసేజ్ పెట్టాడు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్న పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
MLA సంజయ్‌కు ఇంటిపోరు.. మళ్లీ ‘గేర్’ మారుస్తారా?

పార్టీ ఫిరాయింపు నోటీసుపై BRSలోనే ఉన్నట్లు JGTL MLA సంజయ్ స్పీకర్‌కు వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అలాగే స్థానికంగా తనది ఏ పార్టీనో చెప్పుకోలేని సంకట స్థితిలో MLA ఉన్నారు. కాగా, ఎవరి పార్టీలో వారుంటే మంచిదే కదా అంటూ ఇప్పటికే మాజీమంత్రి జీవన్ రెడ్డి సంజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్‌కు ఇంటిపోరు ఎక్కువవ్వడంతో CONGలో ఉంటారా? BRSలోకి వెళ్తారా? అన్న చర్చ జరుగుతోంది.
News September 13, 2025
కరీంనగర్: కానరాని బొడ్డెమ్మ పండుగ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుక కనుమరుగయిపోయింది. కాగా, భాద్రపద బహుళ పంచమి నుంచి ఈ బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. గ్రామాల్లో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బొడ్డెమ్మ వేడుకలు గ్రామాల్లో మాత్రం కనిపించడం లేదు.