News January 19, 2025
KMR: జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

కామారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా నిలకడగా ఉన్న చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు జిల్లాలో ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ 12.2, మేనూర్ 12.7, గాంధారి 13.2, డోంగ్లి 13.5, బిచ్కుంద, పుల్కల్ లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News November 8, 2025
HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

డంపింగ్ యార్డ్ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.
News November 8, 2025
గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.