News April 16, 2025

KMR: జిల్లాలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతల తాకిడికి గురవుతోంది. ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం నస్రుల్లాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా పిట్లంలో 39.4°లుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణం భరించలేని విధంగా మారింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Similar News

News January 27, 2026

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రాకపోకలు నిలిపివేత

image

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా గత రెండు వారాలుగా వైరా-జంగారెడ్డిగూడెం మధ్య అనుమతి ఇవ్వగా, అతివేగం, పొగమంచు కారణంగా కల్లూరు, వైరా పరిసరాల్లో వరుస ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు భద్రతా కారణాలతో హైవేను మూసివేశారు.

News January 27, 2026

భువనగిరి: స్కూళ్ల నిర్వహణకు నిధుల విడుదల

image

భువనగిరి ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రెండో విడత నిధులు విడుదలయ్యాయి. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా జిల్లాలోని 599 స్కూళ్లకు రూ.71.05 లక్షలు మంజూరయ్యాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.లక్ష వరకు నిధులు కేటాయించారు. అయితే 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్న 47 పాఠశాలలకు నిధులు రాలేదు. ఈ నిధులను స్కూల్ రిపేర్లు, శుభ్రత, స్టేషనరీ, డిజిటల్ తరగతుల కోసం వినియోగించనున్నారు.

News January 27, 2026

ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే..

image

పంట కోత తర్వాత నిల్వ చేసే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది వేడెక్కి రంగు మారుతుంది. అలాగే పురుగులు, శిలీంధ్రాలు ధాన్యాన్ని ఆశిస్తాయి. బూజు ఏర్పడి, ధాన్యం రంగు మారి వాసన వచ్చి నాణ్యత లోపిస్తుంది. సాధారణంగా వరి ధాన్యంలో తేమ శాతం 22-24% ఉన్నప్పుడు కోస్తారు. ఈ ధాన్యంలో తేమ 12 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టి నిల్వ ఉంచితే పురుగు పట్టకుండా 6 నుంచి 12 నెలల వరకు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.