News November 4, 2025
KMR: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పదోన్నతి

కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.పి.చంద్రశేఖర్‌కు పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఆర్‌ఎంఓగా ఆయన పదోన్నతి పొందారు. గతంలో దోమకొండ Dy.DMHOగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎల్లారెడ్డి Dy.DMHOగా విధులు నిర్వహిస్తూనే ఇన్‌ఛార్జి జిల్లా వైద్యాధికారిగా పనిచేశారు.
Similar News
News November 4, 2025
FLASH: నిర్మల్: యాక్సిడెంట్‌లో డ్రైవర్ మృతి

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామ 61 <<18197838>>జాతీయ రహదారిపై మంగళవారం <<>>మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మామడ మండలం కోరటికల్ గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
News November 4, 2025
తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
News November 4, 2025
భవిత సెంటర్‌లను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

దివ్యాంగ పిల్లల విద్యాప్రమాణాలు మెరుగుపరచేందుకు భవిత సెంటర్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం అన్నారు. నవంబర్ 20 నాటికి మరమ్మతులు, పెయింటింగ్, మౌలిక వసతుల పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచి, యాక్టివిటీలను రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. వినూత్న పద్ధతుల్లో బోధన అందించి, స్పష్టమైన మార్పు కనిపించేలా చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


