News April 5, 2025

KMR: జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు

image

యాసంగి సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 33 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమై 686 టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 2, 2026

HYDలో హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు

image

TG: హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. FIH&హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ వీటిని హోస్ట్ చేయనుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ పాల్గొననున్నాయి. భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే టీమ్‌లు ఇప్పటికే HYD చేరుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టోర్నీ HYDలో జరగడం ఇదే తొలిసారి.

News March 2, 2026

నల్గొండలో పర్యటించనున్న మల్లికార్జున ఖర్గే

image

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు నల్గొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకు నాగార్జున సాగర్ బుద్దవనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు.

News March 2, 2026

GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

image

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్‌లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.