News January 2, 2026
KMR: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి సబ్ డివిజన్‌లో 117 కేసులు, బాన్సువాడ సబ్ డివిజన్‌లో 70 కేసులు, ఎల్లారెడ్డి సబ్ డివిజన్‌లో 55 కేసులు నమోదు అయినట్లు జిల్లా SP రాజేష్ చంద్ర వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News February 14, 2026
అగరిపల్లి చెరువులో మృతదేహం కలకలం

అగరిపల్లిలోని స్థానిక చెరువులో శనివారం వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఘటనా స్థలం వద్ద ఏలూరుకు చెందిన ప్రముఖ మానవతావాది ఆలపాటి నాగేశ్వరరావు ద్విచక్ర వాహనం లభించడంతో కలకలం రేగింది. గత సోమవారం నుంచి ఆయన కనిపించకుండా పోయినట్లు సమాచారం. మృతదేహం నాగేశ్వరరావుదేనా కాదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News February 14, 2026
నల్గొండ: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

చిట్యాల మండలం నేరడ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్‌లో ఈ ఘటన జరగ్గా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే మండలంలోని ఏపూరులో విధులు నిర్వహించారు. ఈ సెప్టెంబర్‌లో రిటైర్డ్ కావలసి ఉంది. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పీఎస్‌లు సానుభూతిని తెలిపారు.
News February 14, 2026
NPCILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గలవారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.74,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in


