News August 26, 2025

KMR: డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది 7 నెలల్లోనే 6,800 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారు. తాజాగా AUG 22న కోర్టు 91 మందికి శిక్షలు వేసింది. వీరిలో 16 మందికి ఒక రోజు జైలు శిక్ష, ఒకరికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. మిగిలిన 74 మందికి రూ. 1,100 చొప్పున జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని SP రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Similar News

News August 26, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: SP

image

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ పలు కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో SP వకుల్ జిందల్ నేడు సమావేశం నిర్వహించారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News August 26, 2025

చైన్‌ స్నాచర్‌ ఆటకట్టించిన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు

image

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌ స్నాచింగ్‌లతో పాటు ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేయూసీ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.23 లక్షల 50 వేల విలువైన 237 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

News August 26, 2025

డ్రైవింగ్ సేఫ్టీపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ అవగాహన

image

డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది. అధికారిక ఫేస్‌బుక్ పేజీలో డ్రైవింగ్ సేఫ్టీకి సంబంధించిన అవగాహన పోస్టర్‌ను అప్‌లోడ్ చేశారు. ప్రయాణం చేస్తున్నప్పుడు దృష్టి పూర్తిగా డ్రైవింగ్‌పైనే కేంద్రీకరించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దన్నారు. చుట్టూ ఉన్న ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.