News October 10, 2025
KMR: డ్రంక్ అండ్ డ్రైవ్..58 మందికి శిక్ష

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడిన 58 మంది వాహనదారులకు గురువారం కోర్టు శిక్షలు విధించింది. దేవునిపల్లి పరిధిలో 4 మందికి రెండ్రోజులు, 6 మందికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా పడింది. మరో 48 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
Similar News
News October 10, 2025
మహబూబ్‌నగర్-రాయచూర్ రహదారికి మహర్దశ

మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దులోని గుడెబల్లూరు వరకు (NH-167) ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు NHAI నిర్ణయించింది. రూ.2,278.38 కోట్ల అంచనాలతో 80 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరగనుంది. గురువారం టెండర్లు ఆహ్వానించగా, హ్యామ్ మోడల్ పద్ధతిలో ఈ రహదారిలో పనులు చేపడతారు. భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. పనులు పూర్తయిన తర్వాత రహదారి వ్యయం టోల్ ఫీజు ద్వారా వసూలు చేస్తారు.
News October 10, 2025
సత్యసాయి జిల్లాలో 409.6 మి.మీ వర్షపాతం నమోదు

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 409.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్ నుంచి అధికారులు తెలిపారు. జిల్లాలోని 32 మండలాలలో చిలమత్తూరు మినహా 31 మండలాలలో వర్షం పడినట్లు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తి 38.4, నల్లమాడ 36.0, పెనుకొండ 27.8, గాండ్లపెంట 25.6, అగళి 23.4, ఓడీసీ 22.6, సోమందపల్లి 21.2, రోళ్లలో 20.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
News October 10, 2025
తిరుపతి: చెవిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వానికి నోటిసులు జారీ చేస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.