News December 21, 2025

KMR: తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ

image

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు పుల్గం రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేస్తున్నందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై అందర్నీ కలుపుకొని ముందుకు వెళతానని అన్నారు.

Similar News

News December 22, 2025

కామారెడ్డి: టెంపరేచర్ డౌన్.. ప్రజలు జాగ్రతగా ఉండాలి

image

కామారెడ్డి జిల్లాలో 17 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 10°Cల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యినట్లు వెల్లడించారు. మిగతా 17 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ జారీ కాగా 15°Cల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, త్వరగా ఇళ్లకు చేరుకోవాలని తెలియజేస్తున్నారు.

News December 22, 2025

105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

image

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.

News December 22, 2025

మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.