News April 10, 2025
KMR: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

తమ్ముడి హత్య కేసులో నిందితుడైన అన్నకు కామారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. SP రాజేష్ చంద్ర వివరాలిలా.. పిట్లం వాసి శాదుల్ అతని తమ్ముడైనా ముజీబ్‌ను ఆస్తి తగాదాల విషయంలో కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనపై పిట్లం PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం మొదటి అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితుడికి జీవిత ఖైదు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చారు.
Similar News
News September 16, 2025
ప్రసారభారతిలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
News September 16, 2025
నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటలలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 397.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 46.8, సోన్ 44, కడెం పెద్దూర్ 39.4, మామడ 30, దిలావర్పూర్ 32.4, బైంసా 28.2, ముధోల్ 19.6, లోకేశ్వరం 21.6, నిర్మల్ మండలాలలో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
News September 16, 2025
డిగ్రీ విద్యార్థులకు అలర్ట్..రేపటితో ముగియనున్న గడువు

ఎన్టీఆర్: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు.