News March 20, 2025
KMR: తాగునీటి సమస్య నివారణపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష

తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణా రెడ్డి సమక్షంలో నిర్వహించిన సమీక్షలో 48 గ్రామాలకు రూ.53.36 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో 5 కొత్త ట్యాంకర్లు కొనుగోలు, అవసరమైతే మరో 4 ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
అల్లూరి జిల్లాలో అరుదైన ఎగిరే ఉడుత

జీకేవీధి మండలం పారికల గ్రామంలో పాంగీ చందు అనే గిరిజనుడు బుధవారం ఉదయం చేను దున్నేందుకు వెళ్లగా అక్కడ చనిపోయిన ఎగిరే ఉడత కనిపించింది. ఉడతను గ్రామంలోకి తీసుకురాగా చూసేందుకు ప్రజలు గుమిగూడారు. వాడుక భాషలో మనుబిల్లి అని పిలుస్తారని స్థానికులు వెల్లడించారు. ఎగిరే ఉడత (ఫ్లయింగ్ క్విరిల్) ఏజెన్సీ గ్రామాలలో కనిపించడం చాలా అరుదని, ఎక్కడి నుంచో ఎగిరి వెళ్తూ పడిపోయి చనిపోయిందని భావిస్తున్నారు.
News July 9, 2025
తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.
News July 9, 2025
సంగారెడ్డి: చేసిన సేవలే గుర్తింపునిస్తాయి: డీఈవో

జహీరాబాద్ మండల విద్యాధికారిగా పని చేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. బుధవారం అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనేది సహజమన్నారు. విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ఎంఈఓలు పాల్గొన్నారు.