News October 22, 2025

KMR: ‘తెలంగాణ రైజింగ్ 2047’ సర్వేలో పాల్గొనండి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన “తెలంగాణ రైజింగ్ 2047” సిటిజన్ సర్వేలో కామారెడ్డి జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల అభిప్రాయాలను సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈనెల 25న సర్వే ముగుస్తుంది కాబట్టి, ఆసక్తి గలవారు www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌‌లో సలహాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.

Similar News

News October 22, 2025

బలి చక్రవర్తి ఎవరంటే?

image

బలి చక్రవర్తి రాక్షస వంశంలో జన్మించినప్పటికీ, అపార దాన గుణంతో, పరాక్రమంతో ముల్లోకాలను పరిపాలించాడు. ఈయన భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్త ప్రహ్లాదుడికి మనవడు అవుతాడు. ఆయన దాతృత్వాన్ని, అహంకారాన్ని పరీక్షించడానికి విష్ణువు వామనావతారంలో వచ్చాడు. మూడడుగుల నేలను దానంగా అడిగాడు. బలి తన సర్వస్వం దానం చేశాడు. ఈ దాన గుణాన్ని మెచ్చిన హరి పాతాళ లోకానికి బలిని చక్రవర్తిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు.

News October 22, 2025

సిద్దిపేట: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్‌ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగ్గా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్‌ను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్‌తో పాటు అతడి స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.

News October 22, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

image

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.