News May 9, 2024
KMR: తొలి MLA, MPలు.. తాతామనవళ్లు
నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి, ZHB లోక్ సభ స్థానానికి తొలి MLA, MPలుగా ఎన్నికైంది షెట్కార్‌లే కావడం గమనార్హం. 1952లో ప్రస్తుత NKD అసెంబ్లీ సెగ్మెంట్ కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉండేది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అప్పారావు షెట్కార్ MLA అయ్యారు. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ MPగా గెలిచారు. కాగా వీరిద్దరూ తాతామనవళ్లు కావడం గమనార్హం.
Similar News
News January 19, 2025
ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు: కవిత
నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ వెకిలి మాటలు మాట్లాడడం మానేయాలని ఆమె సూచించారు.
News January 19, 2025
NZB: నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం NZB రానున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసి గూపన్పల్లిలో, నగరంలో బహిరంగ సభల్లో మాట్లాడి హైదరాబాద్ తిరుగపయనమవుతారు.
News January 19, 2025
నేడు నిజామాబాద్‌కు డీజీపీ
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్‌ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.