News March 24, 2025

KMR: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

పెండింగ్‌లో ఉన్న ధరణీ దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహశీల్దార్లు, ఆర్డీఓలును సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్క్ అవుట్ ఇవ్వాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీవోలు, ఎంపీఓలు పర్యవేక్షించాలన్నారు.

Similar News

News March 29, 2025

VJA: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

image

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో కృష్ణా జిల్లా అవినిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్షలాది లభ్యమయ్యాయి. మరిన్ని బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు.

News March 29, 2025

మంచిర్యాల: అర్ధరాత్రి దొంగల బీభత్సం

image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో వారు నిద్రిస్తుండగానే దుండగులు బంగారం, వెండీ వస్తువులతో ఉడాయించారు. స్థానికుల వివరాలు.. BRS నాయకుడి ఇంటితో పాటు మరొకరి ఇంట్లోకి ప్రవేశించి ఇంటి తలుపులు తెరిచి 30తు. బంగారు వస్తువులు, కిలోన్నర వెండి ఎత్తుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News March 29, 2025

GNT: వారం రోజుల పాటు ఇంటర్ సిటీ రైలు రద్దు 

image

గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్సిటీ రైలు వారం రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. మే నెల 23 నుంచి 29 వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా గుంటూరు-సికింద్రాబాద్(12705-12706) మధ్య తిరిగే ఇంటర్ సిటీ రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఆయా తేదీల్లో ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు.

error: Content is protected !!