News October 9, 2025
KMR: దాడులు జరుగుతున్నా..ఆగని పేకాట దందా!

కామారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, పేకాట రాయుళ్ల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో, పోలీసులు బుధవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసుల్లో మొత్తం రూ.33,690 నగదు స్వాధీనం చేసుకుని, నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పేకాటను ఎంతమాత్రం సహించేది లేదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.
Similar News
News October 9, 2025
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాలి: డీఈవో

విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నేర్చుకున్నది పాఠశాలలో అమలు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
News October 9, 2025
బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.
News October 9, 2025
4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం: కలెక్టర్

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. RSK సిబ్బందికి మద్దతు ధర, ట్రక్ షీట్ విధానంపై శిక్షణలు పూర్తి చేయాలన్నారు.