News January 24, 2025
KMR: దివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ప్రమీల గురువారం తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 % రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News September 15, 2025
కాంగ్రెస్‌తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్‌లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్‌లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
HYD: గొర్రెల స్కామ్ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.
News September 15, 2025
ఇద్దరు పల్నాడు జిల్లా సీఐలపై సస్పెన్షన్ వేటు

గతంలో పల్నాడు జిల్లాలో పని చేసిన ఇద్దరు CI లపై సస్పెన్షన్ వేటు పడింది. 2022 జూన్ 3వ తేదీన దుర్గి (M) జంగమేశ్వరపాడుకు చెందిన TDP నేత జల్లయ్య హత్య కేసులో నిందితులను వదిలేసి అతడి బంధువులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు విచారణకు ఆదేశించింది. అప్పట్లో మాచర్ల రూరల్ CI షమీముల్లా, కారంపూడి జయకుమార్ కేసు తారుమారు చేశారని ఇద్దరిని సస్పెండ్ చేశారు.