News January 24, 2025

KMR: దివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లాలో దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు రుణాలు మంజూరయ్యాయని, వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి ప్రమీల గురువారం తెలిపారు. బ్యాంకుతో సంబంధం లేకుండా 100 % రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News September 17, 2025

కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

image

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

News September 17, 2025

అనంత నుంచి అమరావతికి 45 బస్సులు.. 2,100 మంది సిద్ధం

image

అనంతపురం జిల్లాలో డీఎస్సీ అభ్యర్థులు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈనెల 19న అమరావతిలో డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు జిల్లా నుంచి 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అందులో వారి కుటుంబ సభ్యులు, విద్యాశాఖ అధికారులు.. మొత్తం 2,100 అమరావతికి వెళ్లనున్నట్లు తెలిపారు.

News September 17, 2025

ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల ఆధారంగా ప‌నితీరు ఉండాలి: లక్ష్మీశా

image

ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల ఆధారంగా అధికారులు తమ ప‌నితీరును మెరుగుప‌రుచుకోవాలని క‌లెక్ట‌ర్ లక్ష్మీశా అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని వీడియో కాన్ఫ‌రెన్స్ హాల్ నుంచి ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల ఆదాయాలను పెంచడానికి దోహదపడే ఉద్యానవన, పశుసంవర్థక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.