News October 18, 2025

KMR: దీపావళి సేఫ్‌గా చేసుకోండి: SP

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని KMR SP రాజేష్ చంద్ర సూచించారు. అలాగే జిల్లాలో జూదంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. ఎవరైనా జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రౌడీలు, అనుమానితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలతో కట్టడి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

Similar News

News October 19, 2025

మహిళలను వేధిస్తున్న 44 మంది అరెస్ట్

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్ బృందాలు వివిధ ప్రాంతాల్లో మహిళలను వేధిస్తున్న 44 మంది ఆకతాయిలను అరెస్ట్ చేశాయి. 12 మంది మహిళలు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని DCP సృజన కర్ణం తెలిపారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సహకారంతో ఆరుగురు ట్రాంజెండర్స్‌తోపాటు 12 మంది సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు. CP ఆదేశాల మేరకు ప్రత్యేకమైన తనిఖీలు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు తెలపాలన్నారు.

News October 19, 2025

పెద్దేముల్: రూ.2 వేల కోసం హత్య

image

పెద్దేముల్ మండలంలో 2023లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాండూర్ DSP తెలిపిన వివరాలిలా.. బాలాజీకి ఇచ్చిన రూ.2,050ను తిరిగి ఇవ్వాలని మన్సాన్‌పల్లికి చెందిన రవి(39) గ్రామస్థుల ముందు గట్టింగా అడిగాడు. దీంతో బాలాజీ అవమానంగా భావించాడు. మద్యం తాగించి కత్తితో పొడవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవి చనిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

News October 19, 2025

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్

image

ఐఐటీ బాంబే 53 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 7వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/career/apply