News January 6, 2025

KMR: నవోదయలో లైంగిక వేధింపులు.. టీచర్లకు రిమాండ్‌

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయలో విద్యార్థులను లైంగికంగా వేధించిన నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. గతంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిని కర్ణాటకకు బదిలీ చేశారు.

Similar News

News January 7, 2025

NZB: ఉమ్మడి జిల్లాలో తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి NZB జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ 11.5, డోంగ్లి , 11.9, గాంధారి 12.0, మేనూర్ 12.4, లచ్చపేట్ 13.0 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ నార్త్ 13.7, నిజామాబాద్ సౌత్ 14.0, జానకంపేట్ 14.3, ఏర్గట్ల 14.4, తూంపల్లి 14.5, చందూర్ 14.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

News January 7, 2025

బాన్సువాడ: KTR అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడు: జూపల్లి

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజు ఉన్నారు.

News January 7, 2025

NZB: కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ రాక

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం మంగళవారం మధ్యాహ్నం డిచ్పల్లిలో నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానునున్నట్లు వివరించారు.