News April 6, 2025
KMR: నీళ్లు దుర్వినియోగం.. మూడు కేసులు

మిషన్ భగీరథ నీళ్లు అక్రమంగా దారి మళ్లించి దుర్వినియోగపరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లని దారి మళ్లించి దుర్వినియోగం చేసిన ఇద్దరిపై లింగంపేట్ PSలో, పెద్ద కోడప్గల్ మండలం పోచారం తండాకు చెందిన మరో వ్యక్తి పై కేసు నమోదైనట్లు ఆయన శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
Similar News
News April 7, 2025
నేటి నుంచి ‘అడవితల్లి బాట’.. ప్రారంభించనున్న పవన్

AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ‘అడవితల్లి బాట’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధిపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.
News April 7, 2025
MHBD: ఏడేళ్ల చిన్నారిపై కిడ్నాప్‌కు యత్నం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పిచ్చిరాం తండాలో ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చెయ్యడానికి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సోదరుడు, మరో బాలుడితో చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు వచ్చి చిన్నారిని బలవంతంగా బైకుపై ఎక్కించుకొని వెళ్లారు. చిన్నారి కేకలు వేయడంతో వదిలిపెట్టి పారిపోయారు.
News April 7, 2025
రుద్రంగి: ఫుడ్ పాయిజన్.. మహిళా మృతి

ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతిచెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పుష్పలత పరిస్థితి విషమించి ఆదివారం మరణించింది.