News March 15, 2025
KMR: నేటి నుంచి ఒంటి పూట బడులు

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు మాత్రమే స్కూలు ఉంటుంది. ఈ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పరీక్షలైన అనంతరం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూలు ఉంటుంది. వేసవి సందర్భంగా మధ్యాహ్నం వరకే క్లాసులు నిర్వహించనున్నారు.
Similar News
News February 22, 2026
ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

శుభకార్యాల సీజన్‌కు తోడు ఇవాళ ఆదివారం సెలవు కావడంతో చాలామంది బంగారం, వెండి కొనుగోళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,59,280గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,46,000 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేట్ రూ.2,90,000గా కొనసాగుతోంది. ఇటీవల భారీగా పెరిగిన ఈ రెండు మెటల్ రేట్స్ కాస్త తగ్గి కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి.
News February 22, 2026
నిర్మల్: రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి

కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23వ తేదీ (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభమవుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదులు సమర్పించాల్సిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 22, 2026
బాలిక మిస్సింగ్.. తంబళ్లపల్లె జనసేన ఇన్‌ఛార్జ్ సోదరుడిపై ఫిర్యాదు

ములకలచెరువు మండలంలో ఓ మైనర్ బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. మండలంలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక మిస్సింగ్ అయినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం రాత్రి నుంచి కనపడకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు SI చెప్పారు. అయితే తంబళ్లపల్లె జనసేన ఇన్‌ఛార్జ్ సోదరుడు హరినాథ్ తన కుమార్తెను తీసుకెళ్లినట్టు ఆరోపించారు.


