News January 21, 2025

KMR: నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: SP

image

నేరాల‌కు పాల్ప‌డితే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చ‌రించారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన ఒక కేసులో సోమవారం ఇద్దరినీ కోర్టు ముందు హాజరు పరిచామన్నారు. ఒకరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష , రూ.4 వేల జరిమానా, మరొకరికి ఏడాది జైలు శిక్ష రూ.4 వేల జరిమానా విధిస్తూ.. జిల్లా జడ్జి వరప్రసాద్ తీర్పు విధించినట్లు ఆమె తెలిపారు.

Similar News

News November 11, 2025

టీ శాట్ రాష్ట్ర స్థాయి పోటీలకు వరంగల్ విద్యార్థులు

image

తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం, టీ శాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. చెన్నరావుపేట మండలం ఉప్పరపల్లి ZPHS విద్యార్థిని CH. ద్రాక్షాయని, ఖానాపురం మండలం బుధరావుపేట ZPHS విద్యార్థులు జి.శివాని, ఎండి.హాసన్ జిల్లా స్థాయిలో మొదటి స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

News November 11, 2025

PDPL: ప్రతి విద్యార్థికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించాలి: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా అమలుపై సమీక్ష జరిగింది. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులందరూ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల సెలవులు ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆదేశించారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ కోర్సులు అమలు అవుతాయని, జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.

News November 11, 2025

SKLM: ఛైన్ స్నాచర్ అరెస్టు..10 తులాల బంగారం స్వాధీనం

image

ఒంటరి మహిళలలే లక్ష్యంగా ఛైన్ స్నాచింగ్ పాల్పడిన ముహేశ్వర్ దళాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఇచ్ఛాపురం, మందస, కవిటి, కాశీబుగ్గ‌ PSలలో నిందితుడిపై దొంగతనం కేసులు నమోదవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇవాళ కాశీబుగ్గ కోసంగిపురం జంక్షన్ వద్ద ముద్దాయిని అదుపులోకి తీసుకుని 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దళాయ్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేశాడని SP కేవీ మహేశ్వరెడ్డి మీడియాకు తెలిపారు.