News March 29, 2025
KMR: పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి: సీఈఓ

రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డి చట్టాల అమలు, శాంతి భద్రతలు, ఓటరు జాబితా సవరణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
PRG: సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బట్టి పేలి.. ఒకరి మృతి

పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామం వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నారీ జిల్లాకు చెందిన కార్మికుడు మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI మోహనకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 7, 2025
నేడు పేర్కంకంపల్లికి ఎమ్మెల్సీ కవిత

యాలాల: చేవెళ్ల బస్సు ప్రమాదంలో పెర్కంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయిప్రియా, తనుష, నందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు MLC కవిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రానున్నారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
News November 7, 2025
అక్బర్‌పేట-భూంపల్లి: అరుదైన ఘటన.. ఆవుకు రెండు దూడలు

అక్బర్‌పేట- భూంపల్లి మండలం అగ్రహారం గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రైతు సాదుల సురేష్‌కు చెందిన గోమాత ఒకే ప్రసవంలో రెండు లేగదూడలకు (మగ, ఆడ) జన్మనిచ్చింది. ఒక గంట వ్యవధిలో ఈ దూడలు పుట్టడంపై రైతు కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అరుదైన దృశ్యం కావడంతో పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి చూస్తున్నారు.


