News February 28, 2025
KMR: పట్టభద్రులు 78.12 శాతం, ఉపాధ్యాయులు 93.63 శాతం

కరీంనగర్, ఆదిలాబాద్, NZB, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల MLC స్థానాలకు జరిగిన ఎన్నికలు కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో పట్టభద్రులు 16,410 ఉండగా, 12820 మంది ఓటును వేశారు. దీంతో జిల్లాలో గ్రాడ్యుయేట్ పోలింగ్ 78.12శాతం నమోదైంది. అటు జిల్లాలో 2011 మంది టీచర్లకు ఓటు హక్కు ఉండగా 1883 మంది తమ ఓటును వేశారు. టీచర్లు 93.63% ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం.
Similar News
News November 12, 2025
HYD ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు.. నెల్లూరు వాసి అరెస్ట్

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో CISF అధికారులు అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అబుదాబీ నుంచి HYD వచ్చిన నెల్లూరు వాసి జయరాం సూర్యప్రకాశ్, చెన్నై వాసి మహమ్మద్ జహంగీర్ లగేజీలను చెక్ చేయగా సుమారు రూ.2 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. 8 డ్రోన్లు, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్‌లు, 4 వీడియో గేమ్స్ పరికరాలు, డ్రోన్స్‌ను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.
News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.
News November 12, 2025
జూబ్లీహిల్స్: సర్వేల్లో BRS.. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్..!

జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై లోకల్ వాళ్లే కాదు తెలుగు రాష్ట్రాల వారు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎలక్షన్ ముందు దాదాపు అన్ని సర్వేలు BRS గెలుస్తుందని చెప్పగా ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. దీంతో థగ్ ఆఫ్ వార్ పోటీ ఉందంటూ ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. NOV 14న వెలువడే ఫలితాల్లో గెలుపు మాదే అంటూ ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి.


