News March 26, 2025

KMR: పదో తరగతి పరీక్షలకు 26 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. బుధవారం గణితం పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరిచారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా దేవునిపల్లిలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Similar News

News March 29, 2025

పార్వతీపురం: శాశ్వత లోక్ అదాలత్‌పై అవగాహనా సదస్సు

image

ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించి శాశ్వత లోక్ అదాలత్ ఆవశ్యకత, సామర్ధ్యం పెంపుదల, కేసుల పరిష్కార విధానం, సామర్ధ్య పెంపుదల మార్గాలు, వివాదాలను పరిష్కరించే అధికారం శాశ్వత లోక్‌ అదాలత్‌కు ఉందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణా సమావేశంలో పాల్గొన్నారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

News March 29, 2025

కన్నప్ప విడుదల వాయిదా: మంచు విష్ణు

image

కన్నప్ప సినిమా విడుదల ఆలస్యం అవుతుందని నటుడు, నిర్మాత మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం ఉంది. అందుకే విడుదల తేదీ ఆలస్యం కానుంది. దీనికి మేం చింతిస్తున్నాం. మీ ఓపికకు, మద్దతుకు ధన్యవాదాలు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.

News March 29, 2025

సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 31న రంజాన్ పండుగ సందర్భంగా పీజీఆర్ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలు, అధికారులందరూ గమనించాలని ఆయన కోరారు.

error: Content is protected !!