News March 28, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 31, 2025
భూపాలపల్లి : నిరుద్యోగ యువత ఆందోళన.. !

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాస్ పథకం కోసం దరఖాస్తు చేసిన నిరుద్యోగ యువత ఆందోళనలో ఉన్నారు. ఈ పథకం ప్రయోజనాలు గ్రామీణ కార్యకర్తలకు చేరకుండా, అర్హత కలిగిన నిరుద్యోగులకు అధికారుల ద్వారా అందాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుద్యోగ యువతకు అందించే గొప్ప అవకాశమని వారు అభిప్రాయపడ్డారు.
News March 31, 2025
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

AP: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కన్పిస్తోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామిని 62,263 మంది దర్శించుకోగా.. 25,733 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
News March 31, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.