News March 24, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. 23 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా.. మొత్తం 12,579 విద్యార్థులకు గాను 12,556 మంది పరీక్ష రాయగా, 23 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
Similar News
News September 13, 2025
MLA సంజయ్‌కు ఇంటిపోరు.. మళ్లీ ‘గేర్’ మారుస్తారా?

పార్టీ ఫిరాయింపు నోటీసుపై BRSలోనే ఉన్నట్లు JGTL MLA సంజయ్ స్పీకర్‌కు వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అలాగే స్థానికంగా తనది ఏ పార్టీనో చెప్పుకోలేని సంకట స్థితిలో MLA ఉన్నారు. కాగా, ఎవరి పార్టీలో వారుంటే మంచిదే కదా అంటూ ఇప్పటికే మాజీమంత్రి జీవన్ రెడ్డి సంజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్‌కు ఇంటిపోరు ఎక్కువవ్వడంతో CONGలో ఉంటారా? BRSలోకి వెళ్తారా? అన్న చర్చ జరుగుతోంది.
News September 13, 2025
కరీంనగర్: కానరాని బొడ్డెమ్మ పండుగ..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుక కనుమరుగయిపోయింది. కాగా, భాద్రపద బహుళ పంచమి నుంచి ఈ బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. గ్రామాల్లో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బొడ్డెమ్మ వేడుకలు గ్రామాల్లో మాత్రం కనిపించడం లేదు.
News September 13, 2025
4 రోజుల్లో 27,650 టన్నుల యూరియా: తుమ్మల

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంటుందని ఆయన శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే శుక్రవారం 11,930 టన్నులు, ఇప్పటి వరకు మొత్తం 23,000 టన్నుల యూరియా సరఫరా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.