News March 21, 2025
KMR: పిడుగు పాటుతో గేదెలు, గొర్రెలు మృతి

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో శుక్రవారం అకాల వర్షం కురిసింది. బిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్, లింగంపేట తదితర మండలాల్లో అకాల వర్షం పడింది. లింగంపేట మండలం లింగంపల్లి శివారులో పిడుగు పడింది. పిడుగు పాటుకు 2 బర్రెలు మృతి చెందాయి. లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామ శివారులో పిడుగు పడి మూడు గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.
Similar News
News September 16, 2025
నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్ వెరిఫికేషన్ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.
News September 16, 2025
దేవరకద్ర: హస్టల్లో ముగ్గురు విద్యార్థులపై దాడి..!

దేవరకద్ర మహాత్మా జ్యోతిబా ఫూలే సాంఘిక సంక్షేమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులపై దాడి జరిగింది. 9వ తరగతి విద్యార్థి ప్రజ్వల్‌తో పాటు మరో ఇద్దరిపై అదే క్లాస్‌కు చెందిన 15 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి 11:30 గంటలకు లైట్లు ఆర్పి దాడి చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2025
ప్రజావాణి పరిష్కార వివరాలను ఆన్లైన్లో పెట్టండి: రాధిక గుప్తా

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 113 అర్జీలు అందాయన్నారు. గతవారం అర్జీల పరిష్కార వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.