News March 20, 2025
KMR: పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర(రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో.సంపత్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ కె. విజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ పరీక్షలలో 75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో TU అడిషనల్ కంట్రోలర్ సంపత్ అధికారులు ఉన్నారు.
Similar News
News October 18, 2025
K-Ramp పబ్లిక్ టాక్

కిరణ్ అబ్బవరం-డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని కాంబోలో తెరకెక్కిన K-Ramp చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే USలో ప్రీమియర్స్ పడ్డాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్, వన్ లైనర్ పంచ్‌లు అలరించాయని NRI ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లా లేదని, డబుల్ మీనింగ్ డోస్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేది అంటున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.
News October 18, 2025
వెల్గటూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

వెల్గటూర్ మండలం స్తంభంపల్లి శివారులో (కొత్తపల్లి బాంక్ సమీపంలో) కారు బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు లక్షెట్టిపేట మండలం శాంతాపూర్కి చెందిన బెక్కం సతీష్‌గా గుర్తించినట్లు ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News October 18, 2025
ఆభరణాలు పెట్టుకుంటే అలర్జీ వస్తోందా?

నగలు పెట్టుకున్నపుడు కొందరికి అలర్జీ వస్తుంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఆర్టిఫిషియల్ ఆభరణాల్లో ఎక్కువగా వాడే నికెల్ అనే లోహం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, పొక్కులు వస్తుంటాయి. వీటిని వేసుకొనేముందు పౌడర్/ మాయిశ్చరైజర్/ క్యాలమైన్ లోషన్స్ రాసుకుంటే మంచిది. లేదంటే స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం, 18 క్యారెట్ ఎల్లో గోల్డ్, స్టెర్లిన్ సిల్వర్లను ఎంచుకోవచ్చు.